HYD : SR నగర్‌లో యువకుడి దారుణ హత్య

by Rajesh |   ( Updated:2024-07-28 04:57:48.0  )
HYD : SR నగర్‌లో యువకుడి దారుణ హత్య
X

దిశ, ఖైరతాబాద్ : టీచర్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా వెంకటరమణ పనిచేస్తున్నాడు. హెయిర్ కట్ షాప్‌లో పనిచేసే బార్బర్ గణేష్‌తో కలిసి ఒకే షేరింగ్ రూమ్‌లో నివాసం ఉంటున్నాడు. గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన గణేష్ కటింగ్ షాప్‌లో ఉపయోగించే కత్తితో వెంకటరమణపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed