HYD : బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ‌డేట్ ఫిక్స్..

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 14:59:59.0  )
HYD : బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ‌డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి మంత్రి తలసాని కీలక ప్రకటన చేశారు. జాతర తేదీలను మంత్రి ప్రకటించారు. జూన్ 19న ఎదురోళ్లు, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు మంత్రి తలసాని కల్యాణం నిర్వహణ, జాతర ఏర్పాట్లపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగే ఈ జాతర మహోత్సవాన్ని చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తారు. ప్రతి ఏడాది ఈ జాతరలో ఐదు లక్షల మంది వరకు పాల్గొంటారు.

Advertisement

Next Story