హంగ్ కామెంట్స్.. మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ!

by Sathputhe Rajesh |
హంగ్ కామెంట్స్.. మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి బుధవారం భేటీ అయ్యారు. నిన్నటి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. కోమటిరెడ్డి వివరణ తర్వాత ఏఐసీసీకి మాణిక్ రావు ఠాక్రే రిపోర్ట్ ఇవ్వనున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ కార్యదర్శులతో ఠాక్రే భేటీ అయ్యారు.

నిన్న కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారితో చర్చించారు. కాగా నిన్న పొత్తులపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తొలుత రాష్ట్రంలో హంగ్ వస్తుందన్న ఆయన తర్వాత తన మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story