పబ్ ఆదాయమెంతో తెలుసా? డ్రగ్స్ కేసులో విస్తుపోయే నిజాలు

by Sathputhe Rajesh |
పబ్ ఆదాయమెంతో తెలుసా? డ్రగ్స్ కేసులో విస్తుపోయే నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. పబ్ ఆదాయం చూసి పోలీసులు అవాక్కు అయ్యారు. ప్రతి నెలా రూ.3.5 కోట్లు ఆదాయం వస్తుండగా.. ప్రతీ వీకెండ్ లో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు గుర్తించారు.

సాధారణ రోజుల్లో రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆదాయంలోని కొంతభాగం లంచాలకే ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అభిషేక్ ఉప్పలకి గోవా, ముంబైలోని వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని, అనిల్ కుమార్ కు డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? డ్రగ్స్ తీసుకున్న 20 మంది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి

Advertisement

Next Story

Most Viewed