గాంధీభవన్ 'మంత్రుల విజిట్' కు భారీ స్పందన

by M.Rajitha |
గాంధీభవన్ మంత్రుల విజిట్ కు భారీ స్పందన
X

దిశ; తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మంత్రుల విజిట్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోన్నది. ఫస్ట్ డే మంత్రి దామోదర రాజనర్సింహా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. కొంత మంది కీలక లీడర్లతో ముఖాముఖీ నిర్వహించారు. ఇందిరాభవన్ లో ఉదయం నుంచి సాయంత్రం3.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. మొదటి రోజు 208 అప్లికేషన్లు రాగా, ఇందులో హెల్త్ ఇష్యూస్, 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు, వివిధ విభాగాల బదిలీలు తదితరవి ఉన్నాయి. 30 మంది ఫిర్యాదులు, సమస్యలను మంత్రి దామోదర స్పాట్ సొల్యూషన్ చూపించారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ కు సంబంధించిన సమస్యలతో పాటు పలు పోలీస్ స్టేషన్లకు చెందిన రిక్వెస్టులను సంబంధిత అధికారులతో మాట్లాడి మంత్రి పరిష్కారం చూపారు.

గాంధీభవన్ లో కేటీఆర్ పై ఫిర్యాదు..

గాంధీభవన్ లో మంత్రి విజిట్ కార్యక్రమంలో ఓ ప్రత్యేకమైన అప్లికేషన్ వచ్చింది. బీఆర్ఎస్ హయంలో తనపై రౌడీ షీట్ పెట్టారని, తాను అలాంటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటానని మంత్రి దామోదర ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా కేటీఆర్ తనపై తప్పుడు కేసులు నమోదు చేయించడాని ఆ యువకుడు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడి ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించి, పూర్తి వివరాలు అందజేయాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. పార్టీకి, ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలు తీసుకొని సమస్య పరిష్కరిస్తామన్నారు. అయితే ఓవర్ నైట్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవడం సరికాదన్నారు. ఒక్కొక్కటి క్రమంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. గతంలో అసలు సమస్యలు వినేవారే లేరని, కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తనకు మొదటి డే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉన్నదని, ఇందుకు పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. బాధితుల నుంచి తీసుకున్న అప్లికేసన్లు, సంబంధిత శాఖకు రిఫర్ చేశామని, త్వరలోనే సమస్యలు పరిష్కరించబడతాయని క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed