IMD : ముంబైకి రెడ్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన

by Hajipasha |
IMD : ముంబైకి రెడ్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ వాణిజ్య రాజధాని ముంబై (మహారాష్ట్ర)కి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం (సెప్టెంబరు 26న) ఉదయం 8.30 గంటల వరకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవధిలో ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఈ ప్రకటన వెలువరించడానికి కొన్ని గంటల ముందు (బుధవారం ఉదయం) మహారాష్ట్రలోని థానే, రాయ్‌గఢ్‌లకు కూడా రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే వారం రోజుల్లో ఉత్తర తమిళనాడు పరిధిలో టెంపరేచర్స్ సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీ సెల్సీయస్ మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల పిడుగుపాటు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed