చెస్ ఒలింపియాడ్..బంగారు పతక విజేతలకు మోడీ అభినందనలు

by saikumar |
చెస్ ఒలింపియాడ్..బంగారు పతక విజేతలకు మోడీ అభినందనలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) చెస్ ఒలింపియాడ్‌లో డబుల్ గోల్డ్ మెడల్ సాధించిన భారత పురుషుల,మహిళల చెస్ బృందాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటి దేశానికి 2 బంగారు పతకాలు తీసుకొచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. అంతకుముందు రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసే చెస్ క్రీడాకారులకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది.

‘మన గౌరవప్రదమైన భారత చెస్ జట్లు, చెస్ ఒలింపియాడ్ -2024లో అద్భుతమైన ప్రదర్శన చేసి బంగారు పతకాలను సాధించాయి. ప్రపంచ వేదికపై భారతదేశ పతాకాన్ని ఎగురవేశాయి’ అని ఎస్ఏఐ ఎక్స్ హ్యాండిల్‌లో రాసుకొచ్చింది. ఇదిలాఉండగా, డి గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటల హరికృష్ణలతో కూడిన భారత పురుషుల చెస్ జట్టు స్లోవేనియాపై గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు కూడా ఫైనల్ టోర్నీలో అజర్‌బైజాన్‌ను 3.5-0.5తో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed