మదర్సాలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. బాలుడు మృతి

by GSrikanth |
మదర్సాలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్సింగిలోని మదర్సాలో గురువారం రాత్రి విద్యార్థుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. చిన్న వివాదంలో 12 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడు స్పృహతప్పి కుప్పకూలాడు. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈ మదర్సాలో బిహార్‌కు చెందిన 12 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు మదర్సాకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story