- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రి రామయ్య కళ్యాణం తలంబ్రాలు ఎలా బుక్ చేయాలంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారామచంద్రుల వారి కళ్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించిందని తెలిపారు. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్‌సైట్ http://tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కళ్యాణ తలంబ్రాలను పొందాలని సూచించారు. ఆఫ్ లైన్ లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
తలంబ్రాలు బుకింగ్ ఎలా చేయాలంటే?
కాగా, టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్‌లో కల్యాణ తలంబ్రాలు అందరుబాటులోకి వచ్చాయి. సైట్‌లో తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే అందులో అడ్రస్, వివరాలు పొందుపరచాలి. తర్వాత తలంబ్రాల ప్యాకెట్లు ఎన్ని కావాలనేది ఎంచుకోవాలి. ఒక తలంబ్రాల ప్యాకెట్ రూ. 151 ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. యూపీఐ ఐడీ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. తర్వాత పేమెంట్ సక్సెస్ అయ్యిందనే ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది.