- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ కేబినెట్‌లో మహిళా మంత్రులు ఎందరు? కవితపై బక్క జడ్సన్ సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్‌లో దీక్ష చేపట్టబోతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సెటైర్ వేశారు. కవిత తాను తీసుకురావాల్సిన మార్పును ఇంటినుంచే మొదలు పెట్టాలని సూచించారు. తొలుత తెలంగాణ క్యాబినెట్‌లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత తన తండ్రి కేసీఆర్‌ను అడగాలని సూచించారు.
ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా కవిత ప్రకటనపై బక్క జడ్సన్ స్పందించారు. అయితే నిన్న మీడియాతో మాట్లాడిన కవిత మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ మహిళా బిల్లుపై హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు.