- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hot News: నో మోర్ కామెంట్స్..! ‘మెఘా’పై నోరు మెదపొద్దు
దిశ, తెలంగాణ బ్యూరో: టీ బీజేపీలోని పలువురు నేతల తీరుతో పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారిస్తోంది. పలువురు లీడర్లు చేస్తున్న వ్యాఖ్యల మూలంగా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే నేపథ్యంలో హైకమాండ్ అలర్ట్ అయింంది. సదరు నేతలు చేస్తున్న విమర్శలు పార్టీకి సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదముందని భావించి అధినాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. అందులో భాగంగానే ‘మెఘా’ సంస్థపై ఎవరూ నోరు మెదపొద్దని అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ సంస్థపై ఎలాంటి విమర్శలు చేయొద్దని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పలువురు లీడర్లు అవలంభిస్తున్న తీరు తెలంగాణలో పార్టీకి ప్లస్ అయినప్పటికీ దేశవ్యాప్తంగా చూసుకుంటే అది నష్టాన్ని చేకూర్చేలా ఉండటమే ఈ ఆంక్షలకు కారణంగా తెలుస్తోంది.
అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం
మెఘా సంస్థ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నేతల తీరు పార్టీకి ప్లస్ అయినా అధినాయకత్వం ఆంక్షల వెనుక మతలబు మాత్రం మరోలా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు ప్రాజెక్టులు మెఘా కంపెనీ చేతిలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మెఘా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో టన్నెల్ నిర్మాణాల పనులు ఈ సంస్థనే చేపడుతోంది. అయితే టీ బీజేపీ లీడర్లు ఆ కంపెనీనీ బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా ప్రాజెక్టులు కుంగిపోవడం, కూలిపోవడం సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పనులు కొనసాగిస్తున్న మెఘా సంస్థనే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు చేపడుతుండటంతో అది పార్టీకే సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను అదే సంస్థకు ఎందుకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తోంది. అందుకే కట్టడి చర్యలకు ఉపక్రమించింది.
సెల్ఫ్ గోల్ అంశాలు ప్రస్తావించకపోవడమే బెటర్
ఈ అంశంపై టీ బీజీపీకి చెందిన కీలక నేతపై జాతీయ నాయకత్వం నుంచి ప్రెజర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా అంశంపై మాట్లాడేటప్పుడు పూర్తిస్థాయిలో తెలుసుకోకుంటే ఎలా అని అధినాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని సదరు నేతకు వివరించాలని అగ్ర నాయకత్వం ప్రయత్నం చేసినట్టు తెలిసింది. సెల్ఫ్ గోల్ చేసే అంశాలపై ప్రస్తావించకుండా ఉండటమే బెటర్ అని హైకమాండ్ భావిస్తోంది. సెల్ఫ్ గోల్ చేసుకుని ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించవద్దని, ఎవరూ నోరు మెదపకూడదనే నిర్ణయాన్ని అధినాయకత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ అంశంపైనా ఇలాంటి ఆదేశాలనే హైకమాండ్ ఇవ్వడం గమనార్హం.
సైలెంట్‌గా ఉండటమే ఉత్తమమనే భావన
బీజేపీ అధినాయకత్వం ఎస్సీ వర్గీకరణ అంశంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేసింది. తెలంగాణ వరకు ఎస్సీ వర్గీకరణ అంశం బీజేపీకి ప్లస్ అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పూర్తి వ్యతిరేకత వస్తుందన్న కోణంలో దాన్ని క్లెయిమ్ చేసుకునే సాహసం కూడా కాషాయ దళం చేయలేదు. ఎందుకంటే దానివల్ల ఒక్క రాష్ట్రంలో లాభం జరిగితే ఇతర రాష్ట్రాల్లో నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలంగాణలో మాదిగల బలం మాల సామాజికవర్గంతో పోల్చుకుంటే ఎక్కువ. అదే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. మాల సామాజిక వర్గానికి చెందిన బలం ఎక్కువగా ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకతను మూటగట్టుకోవడం కంటే క్లెయిమ్ చేసుకోకుండా సైలెంట్‌గా ఉండటమే ఉత్తమమని పార్టీ భావించింది. ఇప్పుడు అదే విధానాన్ని మెఘా సంస్థపై పలువురు చేస్తున్న విమర్శలకూ అమలు చేయనుంది.