- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్మిషన్ లేకుండా హాస్పిటల్ బిల్డింగ్.. మెడికల్ బోర్డ్ రూల్స్ ‘డోంట్‌కేర్’
దిశ, ఖమ్మం సిటీ : కొణిజర్ల మండల కేంద్రంలో భవన యజమానులు, ఓ ఆస్పత్రి యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఇక్కడ నిర్మించిన ఓ భవానానికి ఎటువంటి అనుమతి లేకపోవడం ఓ ఎత్తు అయితే అందులో అనుమతి లేకుండా హాస్పిటల్ నిర్వహించడం మరో ఎత్తు. గత ఏడాది కాలంగా శ్రీ వెంకటేశ్వర అనే పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రికి ఎటువంటి అనుమతి లేదు. మెడికల్ బోర్డు నిబంధనలకు పాతర వేసి నిర్వహిస్తున్నారు. ఇక భవన యజమాని 30ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ అంటూ అధికారులను మచ్చిక చేసుకుని అనుమతి విషయమై తొక్కిపెడుతున్నాడు.
ఇక్కడ పదుల సంఖ్యలో బిల్డింగులకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి లేదని ఫలితంగా పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోతున్నదని సర్పంచ్ వాపోతున్నాడు. కొనిజర్ల మండలంలో ఓ హాస్పిటల్ యాజమాన్యం, భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది కాలంగా ఇక్కడ నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర అనే ఆస్పత్రికి ఎలాంటి అనుమతి లేదని తెలుస్తున్నది. హాస్పిటల్ నిర్వహించాలంటే తొలుత తెలంగాణ మెడికల్ బోర్డు నిబంధనల ప్రకారం భవన, పర్యావరణం, ఫైర్ సేఫ్టీ వంటి అనుమతులన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక బిల్డింగ్ యాజమాని గ్రామపంచాయతీ నుంచి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. సదరు బిల్డింగ్ యాజమాని 30ఏళ్లు రాజకీయాల పేరుతో అధికారులను తన దారిలో తెచ్చుకుని, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.
కలెక్టర్‌కు ఫిర్యాదు..
కొనిజర్ల గ్రామపంచాయతీ, మండల కేంద్రంలో అనేక భవనాలకు అనుమతి తీసుకోలేదని తెలుస్తున్నది. తమ గ్రామ పంచాయతీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ నిర్మిస్తున్నారని, అదే బిల్డింగులో హాస్పిటల్ నిర్వహిస్తూ గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నట్లు గత డిసెంబర్లో సర్పంచ్ తదితరులు లిఖితపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ యాజమాని పలుకుబడితో మేనేజ్ చేస్తున్నట్టు ఆరోపించారు. ఇలాగే పదుల సంఖ్యలో బిల్డింగులకు అనుమతి లేదని ఫలితంగా పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు కోల్పోతున్నామని వాపోయారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్‌పై జిల్లా మెడికల్ అధికారి పర్యవేక్షణ లోపించిందని, ఈవిషయంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
గ్రామపంచాయతీ కార్యదర్శి
కొణిజర్ల గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆస్పత్రి బిల్డింగ్‌కు ఎలాంటి పర్మిషన్ లేదు. విచారణ చేసి నోటీసులు జారీ చేస్తాం. గతంలోనూ పలుమార్లు హెచ్చరించాం.