- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి సచివాలయం కట్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం: హోంమంత్రి మహమూద్ అలీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నూతనంగా నిర్మించిన డాక్టర్బీ.ఆర్.అంబేద్కర్సచివాలయ భవనం లాంటిది దేశంలోనే లేదని హోం మంత్రి మహమూద్‌అలీ అన్నారు. ఇలాంటి సచివాలయాన్ని కట్టించటం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. హోం మంత్రి మహమూద్‌అలీ శుక్రవారం కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టం ఏర్పడిన కొన్ని సంవత్సరాల్లోనే అద్భుతమైన పాలనను కేసీఆర్అందించారన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్కమాండ్కంట్రోల్, పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కొత్తగా నిర్మించారన్నారు.
అధునాతన పద్దతిలో నిర్మించిన సచివాలయంతో అందరు మంత్రులు, అన్ని కార్యాలయాల ఉన్నతాధికారులు ఒకే చోట కలిసి పని చేసే వెసులుబాటు కలిగిందని చెప్పారు. హోంమంత్రితో పాటు ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్మాట్లాడుతూ.. కొత్త సచివాలయ భవనం కేసీఆర్చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. ఇక, నాగార్జునసాగర్ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ రవీందర్రావు, టీఎన్జీఓ హైదరాబాద్జిల్లా అధ్యక్షుడు ముజీబ్తదితరులు హోంమంత్రితో పాటు ఉన్నారు.