హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

by M.Rajitha |
హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
X

దిశ, వెబ్ డెస్క్ : తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బాధిత హోంగార్డులు(Home guards) తెలంగాణ (Telangana) ప్రభుత్వాన్ని కోరారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 300 మంది హోంగార్డులను తొలగించారని, దీనిపై తాము కోర్టుకు వెళ్ళగా.. తమని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందు వాపోయారు. నేడు హైదరాబాద్(Hyderabad) లోని లక్డీకపూల్ లోని డీజీపీ(DGP) ఆఫీసుకు వెళ్ళి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానిస్టేబుళ్లతో సమానంగా ఈవెంట్స్ లో మెరిట్ సాధించినప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేదన్నారు. చిన్న చిన్న కారణాలు సాకుగా చూపి తమను విధుల్లో నుండి తొలగించడం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) పీసీసీ ఛైర్మన్ గా ఉన్నపుడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమనందరిని తిరగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అయ్యారని, ఇకనైనా ఇచ్చిన హామీ మేరకు తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పలువురు బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed