- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ సీఎంను పట్టుకుని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండ్రు : సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్‌ను పట్టుకుని నోటికి ఎంతొస్తే అంత.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాలో డబ్బును తాము ఎత్తుకెళ్లినట్లుగా కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశం మెచ్చేలా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్, యాదాద్రి ఆలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కట్టామని గుర్తు చేశారు. ఏదైనా ఒక కుటుంబంలో ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా.. అప్పుకాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన ఊహించి లంకె బిందెలు ఏమైనా పెట్టి వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే తమ ప్రభుత్వ హయాంలో ఇంటింటకీ నల్లా నీరు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు లాంటి పనులు పెండింగ్‌లో లేకుండా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా తమ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. సాయంత్రమే ప్రగతి భవన్‌ను ఖాళీ చేశారని, ఇల్లు లేక తన పాత ఇంటికే వెళ్లిన నిరండంబర వ్యక్తి తమ నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు అడ్మినిస్ట్రేషన్ రావాలని, కేవలం కేసీఆర్ ఒక్కడికే ఆ సత్తా ఉందని మల్లారెడ్డి అన్నారు.