- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు బండి సంజయ్ రాక.. కామారెడ్డిలో హైటెన్షన్?
దిశ ప్రతినిధి, నిజమాబాద్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన కామారెడ్డి బంద్ పిలుపును భగ్నం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రాత్రి 9 గంటల వరకు కలెక్టరేట్ వద్ద రైతులు కుటుంబ సమేతంగా ధర్నాలు చేసినా, కలెక్టరేట్ ముట్టడి రణరంగాన్ని తలపించినా కలెక్టర్ రైతుల వద్దకు రాకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బంద్కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి పోలీసులు వివిధ పార్టీల నాయకుల ఇళ్ల వద్దకు చేరుకుని అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు.
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ ఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీకి చెందిన ముఖ్య నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ర్టీయల్ జోన్లో డ్రాప్ట్ ప్లాన్లో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా జేఏసీ ఇచ్చిన పిలుపునకు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు చేపట్టిన ఆందోళనకు మొదటి నుంచి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. గురువారం రైతుల ధర్నాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వెంటనే రైతులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నేడు రైతులకు మద్దతుగా ఆయన కామారెడ్డికి రానున్నారు. అయితే బండి సంజయ్ రాకపై సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం బుదవారం అత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని అదుకోవాలని, మాస్టర్ ప్లాన్ రద్ధు చేయాలని కోరారు. రైతులకు మద్ధతుగా కామారెడ్డిలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు బంద్కు మద్దతు తెలిపాయి. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో వ్యవసాయ భూములు ఇండస్ర్టీయల్ జోన్లో భూములు కోల్పోతున్న రైతుల ఆందోళన విషయంలో గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేంధర్ చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం నిర్వహించే నిరసనల్లో ఎమ్మెల్యేను టార్గెట్ చేసే అవకాశాలు ఉండటంతో పోలీసులు నిరసనలను ముందస్తుగా కట్టడి చేసే అవకాశాలున్నాయి.