సునీల్ కనుగోలు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

by Nagaya |
సునీల్ కనుగోలు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. మహిళలను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి...41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన పేరును ఎఫ్ఐఆర్‌లో తీసేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. వీడియో స్పూఫ్‌కు సునీల్ కనుగొలుకు ఎటువంటి సంబంధం లేదని సునీల్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ఇచ్చిన నోటీస్‌పై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అసలు, కాంగ్రెస్ వార్ రూంకు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం ఈ కేసులో సునీల్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలని కోరారు. మరోవైపు, కాంగ్రెస్ వార్‌రూం కేసులో సునీల్ కనుగోలును ఏ1గా చేర్చమని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం...తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed