High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఆర్డర్ కాపీ.. సంచలన అంశాలు ప్రస్తావించిన జడ్జి.

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-07 10:48:16.0  )
High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఆర్డర్ కాపీ.. సంచలన అంశాలు ప్రస్తావించిన జడ్జి.
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీ(High Court Order Copy) సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీలో జడ్జి లక్ష్మణ్(Judge Laxman) సంచలన అంశాలు ప్రస్తావించారు. హెచ్‌ఎండీఏ(HMDA) పరిధికి మించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. కేబినెట్(Telangana Cabinet) ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలన్నారు. అలాగే ఈ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో కూడా తెలియాలని ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

ఈ ఆర్డర్ కాపీ కోసం కేటీఆర్ సైతం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఆయన సహచరులు, న్యాయ నిపుణులతో ఇదే విషయంపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డర్ కాపీ చేతికి అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కేటీఆర్ కూడా రెడీ అయినట్లు సమాచారం. మరోవైపు.. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు న్యాయనిపుణులతో కేటీఆర్ భేటీ అయి చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed