- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్

దిశ, తెలంగాణ బ్యూరో : జేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రకు రాష్ట్ర హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ వర్ధన్నపేట పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. పోలీసుల ఉత్తర్వుల కారణంగానే మూడు రోజులుగా పాదయాత్రను బండి సంజయ్ ఆపివేశారు. పోలీసుల ఆంక్షలను సవాలు చేస్తూ బండి సంజయ్ తరఫున దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు యథావిధిగా షెడ్యూలు ప్రకారం పాదయాత్రను కంటిన్యూ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు సమర్పించిన వీడియోలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెన్ డ్రైవ్‌లో సమర్పిస్తే సరిపోతుందా, దానికి సంబంధించిన సమగ్ర వివరాలను డాక్యుమెంట్ రూపంలో ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
అటు పోలీసులు, ఇటు బండి సంజయ్ తరఫున జరిగిన లోతైన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎక్కడ పాదయాత్రను ఆపివేయాల్సి వచ్చిందో అక్కడి నుంచి యథావిధిగా కొనసాగించుకోవచ్చని, షెడ్యూలు ప్రకారం ముగించుకోవచ్చునని స్పష్టం చేసింది. పోలీసులు ఆంక్షలు విధించడానికి తగిన గ్రౌండ్ లేదని కోర్టు అభిప్రాయపడింది. బండి సంజయ్ తరఫున వాదించిన న్యాయవాది రచనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పెన్ డ్రైవ్‌లో వీడియో, ఆడియో లాంటి సమర్పించినప్పుడు అందులోని సారాంశాన్ని ట్రాన్స్ స్క్రిప్షన్ రూపంలో డాక్యుమెంటుగా సమర్పించాలన్న నిబంధన ఉన్నదని, కానీ దాన్ని పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. వారు సమర్పించిన ఆధారాలు చెల్లవని కోర్టు అభిప్రాయపడినట్లు తెలిపారు.
ఆంక్షలు విధించడానికి తగిన గ్రౌండ్ కూడా లేదని పేర్కొన్న హైకోర్టు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుకున్న డేట్ వరకు కొనసాగించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఎవిడెన్స్ యాక్టు ప్రకారం శాంతి భద్రతలకు సమస్యలు ఎక్కడ వచ్చాయని కూడా కోర్టు ప్రశ్నించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సంఘటనలను బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు లింక్ చేశారని, 150 కి.మీ. దూరం ఉందని కూడా ప్రస్తావించిందని తెలిపారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడినందునే అనుమతి లభించినట్లు తెలిపారు. మరోవైపు పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరిగి కొనసాగించేలా బండి సంజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 27న బహిరంగ సభ కూడా యథావిధిగా జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు.
ప్రచారానికి ఎప్పుడైనా సిద్ధం.. అభ్యర్థి ఎంపికపై వారిదే తుది నిర్ణయం: కోమటిరెడ్డి