చేయని నేరానికి 11 ఏళ్ల జైలు శిక్ష.. ఎట్టకేలకు నిర్దోషిగా విడుదల

by M.Rajitha |
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, వెబ్ డెస్క్ : చేయని నేరానికి జైలుకు వెళ్ళి ఏకంగా 11 ఏళ్లు శిక్ష అనుభవించిన వ్యక్తిని కోర్టు నిర్దోషి అని తేల్చడంతో ఎట్టకేలకు విడుదలయ్యాడు. 2013లో తల్లిని చెట్టుకు ఉరి వేసి చంపాడన్న ఆరోపణపై మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెడదగుండవల్లికి చెందిన పెద్దగుండెల్లి పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని దర్యాప్తు ముగించి జిల్లా కోర్టులో హాజరు పరచగా 2015లో యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పోచయ్య హైకోర్టుకు వెళ్ళగా.. ఇటీవల విచారణలో 'కింది కోర్టు వైద్యుడు, దర్యాప్తు అధికారుల సాక్ష్యాలను ఆధారం చేసుకొని శిక్ష విధించిందని కాని ఈ కేసులో వైద్యుడు ఆ వృద్దురాలిది హత్యనో ఆత్మహత్యనో స్పష్టంగా చెప్పలేదని.. అలాగే దర్యాప్తు అధికారి తప్ప ప్రత్యక్ష సాక్షులు కూడ ఎవరూ లేకపోవడంతో నేర నిరూపణకు సరైన ఆధారాలు లేవంటూ' హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ పోచయ్యను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed