Helpline number : మత్స్యకారులు హెల్ప్ లైన్ నంబర్‌ సేవ్ చేసుకోండి

by Prasad Jukanti |   ( Updated:2024-09-03 14:55:55.0  )
Helpline number : మత్స్యకారులు హెల్ప్ లైన్ నంబర్‌ సేవ్ చేసుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మత్స్యకారుల కోసం 24 గంటల హెల్ప్ లైన్ సేవలను ఆ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ లోని మత్స్య భవన్ లో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ డా.ప్రియాంక అలా, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ హెల్ప్ లైన్ నెంబర్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సహాయార్థం 8090199299 హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు భారీగా నిండిన నేపథ్యంలో మత్స్యకారులకు 24 గంటల పాటు ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed