Traffic Jam: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

by GSrikanth |
Traffic Jam: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో అకాల వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండగా.. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌‌తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోతగా కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ స్థాయిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో.. నగరం మొత్తం తడిసిముద్దయింది. రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్లలో రోడ్లపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలవటంతో.. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, DRF బృందాలు అప్రమత్తమయ్యాయి. వర్షం వల్ల సమస్యలు తలెత్తితే, సహాయం కోసం డీఆర్ఎఫ్ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని అధికారులు సూచించారు. మరోవైపు వర్షం కారణంగా ఉప్పల్ మైదానంలో జరుగబోయే మ్యాచ్ ఆలస్యమైంది. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్‌, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, ఐకియా, మాదాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

Next Story

Most Viewed