- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపే ఉప్పల్ మైదానంలో IPL మ్యాచ్.. ప్లేయర్ల కోసం పిచ్‌లోకి పరిగెడితే ఇక అంతే!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ మరో 24గంటల్లో ప్రారంభం కానుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం(ఏప్రిల్ 2వ తేదీ) సన్ రైజర్స్ హైదరాబాద్–రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7 గంటలకు మ్యచ్ జరుగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద భద్రత ఏర్పాట్లపై రాచకొండ సీపీ చౌహాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ చౌహాన్ చెప్పారు. స్టేడియం దగ్గర 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సీపీ చౌహాన్. ప్రేక్షకులకు, సామాన్య ప్రజలకు, మ్యాచ్‌కి వచ్చే ప్రముఖులకు, ప్లేయర్స్‌కి.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ పెట్టామన్నారు సీపీ. క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమకు సహకరించాలని.. పిచ్‌లోపలికి వెళ్లడానికి ప్రయత్నించొద్దని సూచించారు.