కిక్కిరిసిన మెట్రోలు.. ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు

by M.Rajitha |
కిక్కిరిసిన మెట్రోలు.. ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో గణేష్ నిమమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ (Hussain Sager) వద్ద జరిగే భారీ నిమాజ్జనాలను చూడటానికి నగరవాసులు భారీగా తరలి వస్తున్నారు. సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండి పోయింది. కాగా హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్ సర్వీసులు, ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులను ప్రత్యేకంగా నడుపుతున్న విషయం తెలిసిందే. మెట్రో మార్గాల గుండా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే వారి సంఖ్య వేలల్లో ఉండటంతో.. నేడు అన్ని రూట్లలో మెట్రోలు కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ (Khairathabad Metro Station) వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. రద్దీని కంట్రోల్ చేయలేకపోయిన మెట్రో అధికారులు మెట్రో స్టేషన్ గేట్లను మూసి వేశారు. ప్రతి పదినిముషాలకు ఒకసారి మాత్రమే గేట్లను ఓపెన్ చేసి, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను లోపలికి వదులుతున్నారు. మెట్రో గేట్లు మూసివేయడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు, మెట్రో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే అన్ని మార్గాల్లోని బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లలో కూడ తీవ్ర రద్దీ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed