Weather Report: మరికాసేపట్లో ఆ జిల్లాల్లో భారీ వర్షం..

by Indraja |   ( Updated:2024-06-08 08:36:54.0  )
Weather Report: మరికాసేపట్లో ఆ జిల్లాల్లో భారీ వర్షం..
X

దిశ వెబ్ డెస్క్: ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరి కాసేపట్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మరి కాసేపట్లో హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట్, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. అలానే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed