హైదరాబాద్‌లో భారీ వర్షం.. అతలాకుతలం అవుతున్న పట్టణం (వీడియో)

by Disha Web Desk 12 |
హైదరాబాద్‌లో భారీ వర్షం.. అతలాకుతలం అవుతున్న పట్టణం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గత పది రోజులుగా వేసవి తాపం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం 4 తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోయింది. భారీగా పట్టిన మబ్బులతో భీకర వర్షం కురిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులతో వర్షం పడింది. దీంతో నగరంలో ఒక్కసారిగా కల్లోలం మొదలైంది. మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఎండలో ఇబ్బంది పడ్డ ప్రజలు అనుకోకుండా భారీ వర్షం కురవడంతో మరోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా భారీ గాలీతో కూడా,, అతి భారీ వర్షం పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 30 నిమిషాలపాటు కురిసిన ఈ వర్షం కారణంగా నగరం మొత్తం జలమయమైంది. సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ వర్షం.. అమీర్ పేట్, ఇర్రం మంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, అసెంబ్లీ, కోటి, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, బేగంపేట, సికింద్రబాద్, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్, రామ్ నగర్, ప్రాంతాల్లో దాదాపు 40 నిమిషాల పాటు వర్షం కురిసింది.

Read More...

ఒక్కసారిగా మారిన హైదరాబాద్ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం



Next Story

Most Viewed