సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. గేట్లను ఎత్తిన అధికారులు

by Mahesh |   ( Updated:2024-09-05 09:00:14.0  )
సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. గేట్లను ఎత్తిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. ప్రాజెక్టులోకి వస్తున్న వరద కారణంగా పూర్తిస్థాయిలో నిండటంతో ఏడాది తర్వాత సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 40,496 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 28,473 టీఎంసీలుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో మంత్రి దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించి గేట్లను ఎత్తారు. అంతకు ముందు డ్యామ్ గేట్లను ఎత్తే అవకాశం ఉండటంతో మంజీరా నది తీర పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దిగువ ప్రాంత ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

Next Story