- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Update: తెలంగాణలో భారీగా డెంగ్యూ కేసులు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు ప్రభలుతున్నాయి. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రోజు రోజుకి డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రులలో ఓపీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
ఇందులో కొందరు రోగులు జ్వరం భారిన పడి మరణిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో వెయ్యికి పైగా ఓపీలు రిజిస్టర్ అయ్యాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఓపీలు పెరగడంతో ఆసుపత్రులలో వైద్యులు, బెడ్ల కొరత ఉందని రోగులు వాపోతున్నారు. సీజనల్ వ్యాధుల భారిన పడిన రోగులు ఆసుపత్రలకు క్యూ కడుతున్నారని, దీని కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని ఓ వైద్యాధికారి తెలిపారు. ఇక తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 4 వరకు 2,847 డెంగ్యూల కేసులు నమోదు అయ్యాయని, అందులో హైదరాబాద్‌లో 1101, ఖమ్మం 287, మేడ్చల్ 268, సూర్యాపేటలో 217 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. జులై 14 నాటికి తెలంగాణలో 6,500 టైఫాయిడ్, 140 మలేరియా కేసులు నమోదు అయ్యాయని వైద్యశాఖ నివేదిక వెల్లడించింది.