- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Harish Rao:పేషెంట్లకు ఇబ్బందులు కలిగిస్తే సహించను..
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన పేషెంట్లకు ఇబ్బందులు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించనని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై ఆయన వీడియా కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..పేదలకు నాణ్యమైన వైద్య సేవలు పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బడ్జెట్ లో రూ.12,364 కోట్లు కేటాయించి ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసినట్లు చెప్పారు. ఈక్రమంలో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లతో ఆప్యాయంగా చికిత్సను అందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిపై తన నిఘా ఉన్నదని, పేషెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు, వైద్యసదుపాయాలు, మందుల కొరత వంటివి లేకుండా చేశామన్నారు. అయితే పీడియాట్రిక్ సేవలు, ఎస్ఎన్సీయూ, పాలియేటివ్ కేర్ ఫెసిలిటీ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల తెలుసుకునేందు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చిన టిఫా స్కాన్లు గర్బిణులకు వరంగా మారాయన్నారు.
గడిచిన మూడు నెలల్లో 6395 టిఫా స్కానింగ్ లు చేయడం వల్ల గర్బిణులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు.గత నెలలో సాధారణ ప్రసవాలు ఎక్కువ శాతం నమోదు చేసిన వికారాబాద్, జనగాం, ఖమ్మం జిల్లా ఆసుపత్రుల ఓబీజీ విభాగాలను మంత్రి అభినందించారు. ఇదే విధంగా ఏరియా ఆసుపత్రి నాంపల్లి, పటాన్ చెరు, హుజూర్ నగర్, సీహెచ్సీ కల్వకుర్తి, సిహెచ్సీ షాద్ నగర్ లను అభింనందించారు. అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.అన్ని ఆసుపత్రుల్లో నూతన మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత సూపరిటెండ్లపై ఉందన్నారు. మందులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రిఫర్ చేయకూడదని, డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, అన్ని జిల్లా, ఏరియా,సీహెచ్సీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Also Read:...
CM KCR:వికలాంగులకు సూపర్ న్యూస్.. వచ్చే నెల నుంచి రూ.4,116 పెన్షన్