‘నకిలీ మందులను ఊపేక్షించం’.. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా స్ట్రాంగ్ వార్నింగ్

by Satheesh |
‘నకిలీ మందులను ఊపేక్షించం’.. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సూచించారు. అన్ని ఆసుపత్రులలో సరిపడా మందులు స్టాక్ ఉండాలన్నారు. ఎక్కడా కొరత రాకూడదన్నారు. శనివారం ఆయన హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్‌లు, ఎఫ్ఎప్ఎస్ఏఐ యాక్ట్ అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ పై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో కృషి చేస్తున్నామన్నారు. నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా నిరంతరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు లోని హాస్టల్స్, క్యాంటీన్ల లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పర్యవేక్షణ అవసరం అన్నారు.

అన్ని క్యాంటీన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక పుడ్ సేప్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకు తగిన కార్యచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. నకిలీ మందులు ఉత్పత్తిపై ఊపేక్షించకూడదన్నారు. ఎంత పెద్ద వారి ప్రమేయం ఉన్నా, చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివ లీల, తెలంగాణ మెడికల్ థింక్స్ కాన్స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దేవేందర్ కుమార్, సురేందర్ రెడ్డి ,జగదీష్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed