- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొన్న ఏసు కృప.. నేడు నరసింహస్వామి దయ.. హాట్ టాపిక్‌గా హెల్త్ డైరెక్టర్ కామెంట్స్..!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి చర్చగా మారారు. ఏసుక్రీస్తు దయతోనే కరోనా తగ్గిందంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆయన శనివారం యాదగిరిగుట్టను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. యాదాద్రీశుడి దయతో రెండేళ్లుగా కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఫోర్త్ వేవ్ వ్యాపించకుండా సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని.. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హెల్త్ మినిస్టర్ హరీశ్ రావుతో పూర్తిస్థాయిలో సమీక్ష జరిపామని చెప్పారు.
రాజకీయ విమర్శలతోనే యాదాద్రి సందర్శన?:
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వైఖరిపై గత కొంత కాలంగా విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లను శ్రీనివాసరావు మొక్కడంపై తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం భద్రాది కొత్తగూడెం జిల్లాలో జీఎస్ఆర్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఏసు క్రీస్తు కృపతోనే కరోనా నుంచి మనం విముక్తులం అయ్యామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
అధికారి హోదాలో ఓ మతానికి కొమ్ముకాయడం ఏంటని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ కోసం కేసీఆర్ కాళ్లు మొక్కడమే కాకుండా ఇవాళ ఓ మతానికి కొమ్ముకాస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై రాజకీయంగా విమర్శలు వస్తుండటంతోనే శ్రీనివాస్ రావు ఇవాళ యాదాద్రిని దర్శించుకున్నారని, యాదాద్రీశుడి దయతో కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యలు చేశాడనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా మొన్న ఏసు.. నేడు యాదగిరిగుట్ట స్వామి పేరుతో శ్రీనివాస్ రావు రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.