- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రుడు.. గరిమెళ్ల మృతి పట్ల సీఎం చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (Garimella Bala Krishna Prasad) మృతి (Died) పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విచారం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Thirupati Devasthanam) గరిమెళ్ల చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆయన.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి నన్ను దిగ్భ్రాంతికి (Shocking) గురి చేసిందని అన్నారు. అలాగే 1978 నుండి 2006 వరకు టీటీడీలో (TTD) ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600 లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి (Great Person) అని కీర్తించారు.
అంతేగాక సంప్రదాయ కర్ణాటక, జానపద, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన గరిమెళ్ల.. తిరుమల శ్రీ వారి సేవలో తరించారని తెలిపారు. ఇక తన మధుర గాత్రంతో శ్రీ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారని, అలాంటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి (Deep Condolences) తెలియజేస్తున్నాను అని చంద్రబాబు రాసుకొచ్చారు. కాగా ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం గుండె పోటుతో తిరుపతిలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గరిమెళ్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంచి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా సేవలు అందించారు.
READ MORE ...
మూగబోయిన స్వరం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత