వేడెక్కిన క్రికెట్ రాజకీయం.. 3 గంటలకు మీడియా ముందుకు అజారుద్దీన్

by Nagaya |   ( Updated:2022-09-23 05:41:46.0  )
వేడెక్కిన క్రికెట్ రాజకీయం.. 3 గంటలకు మీడియా ముందుకు అజారుద్దీన్
X

దిశ, వెబ్‌డెస్క్ : జింఖానా గ్రౌండ్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్ టికెట్ల వ్యవహారం హెచ్‌సీఏ, తెలంగాణ ప్రభుత్వం మధ్య పంచాయితీ పెట్టింది. హెచ్‌సీఏ చైర్మన్ అజారుద్దీన్‌ను టార్గెట్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీఏ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదని, మ్యాచ్ అయిపోయాక దాని సంగతి చూస్తామని హెచ్చరికలు జారీ చేశారు. టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కామెంట్స్‌పై అజారుద్దీన్ సైతం అదే స్థాయిలో ప్రతి స్పందించారు. ఆఫీసుల్లో కూర్చొని రివ్యూలు చేసినంత ఈజీగా మ్యాచ్‌ను మానిటరింగ్ చేయలేవని ఘాటుగా రిప్లె ఇచ్చారు. కాంప్లిమెంటరీ పాస్‌ల కోసమే టీఆర్ఎస్ నేతలు హెచ్‌సీఏపై ఒత్తడి పెంచుతూ ఆగ్రహానికి గురువుతున్నారని విమర్శలు గుప్పించారు.

కాగా, శుక్రవారం ఇదే అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు వస్తానని ఆయన ప్రకటించారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సైతం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అజారుద్దీన్ నిన్న జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన ఘటన.. టికెట్ల విక్రయం, మంత్రి కామెంట్స్‌పై మీడియా సమావేశంలో స్పందించే అవకాశం ఉంది. మరోవైపు టికెట్ల విక్రయంలో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్‌పై ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ల వ్యవహారంలో అజార్ తప్పుడు లెక్కలు చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. పబ్లిక్‌కు అమ్మే 30 వేల టికెట్లలో 12 వేలు మాయం అయ్యాయని, ఆ 12 వేల టికెట్ల మిస్సింగ్ పై హెచ్‌సీఏ నోరు మెదపడం లేదని క్రికెట్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నారు. అయితే మధ్యాహ్నం జరగబోయే మీడియా సమావేశంలో అజారుద్దీన్ ఈ విషయాలపై స్పందిస్తారా.. లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది.

Also Read : హెచ్‌సీఏ × సర్కార్.. తీవ్రరూపం దాల్చిన పంచాయితీ!

Also Read : జింఖానా గ్రౌండ్ ఎదుట నేటి పరిస్థితి ఇదే..

Advertisement

Next Story