- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా వెళ్లిందా? కాంగ్రెస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా పలు ఆధారాలు పోస్ట్ చేసింది. ఏడేళ్ల క్రితం జూలై 23, 2016న కేసీఆర్ హయాంలో జరిగిన సంఘటనను కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగినట్టుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది. బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా వెళ్లిందా? అందుకే పదేళ్ల బీజేపీ పాలనపై ప్రశ్నించకుండా, 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారా? అని ప్రశ్నించింది.
అబద్దాలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడానికి, దొంగ ప్రచారాలకు తెర తీసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా అని పేర్కొంది. కేసీఆర్ చేసిన అవినీతి, దోపిడీ, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసి ఛీ కొడుతున్నారని ఇలాంటి నీతి మాలిన పనులకు బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రీకారం చుట్టిందని విమర్శించింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జరిగిన సంఘటన వీడియో పోస్ట్ చేసింది.