- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మేడం.. 'అలయ్ బలయ్'కి రండి
by GSrikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే 'అలయ్-బలయ్' కార్యక్రమానికి తప్పకుండా రావాలని అలయ్-బలయ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి గవర్నర్ తమిళి సైకి ఆహ్వానం అందించారు. రాజ్ భవన్‌లో శనివారం గవర్నర్‌ను విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి ఆహ్వానాన్ని అందజేశారు. దసరా మరుసటి రోజు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో ఈ వేడుకలను ప్రతి ఏటా అలయ్-బలయ్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ వేడుకలో రాష్ట్రానికి చెందిన సంస్కృతి, కళాకారులు, సాంప్రదాయ వంటకాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచేలా కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
Next Story