- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయొద్దంటూ హర్షసాయి అనూహ్య పోస్ట్

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ (Betting apps) పై సోషల్ మీడియా వేదికగా ఓ యుద్దమే నడుస్తుంది. తాజాగా దీనికి ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (IPS officer, RTC MD Sajjanar) మద్దతు తెలపడం తో పాటు యువతకు కీలక పిలుపునిచ్చారు. దీంతో గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారు సైతం తమ వీడియోలను తొలగించడంతో పాటు తెలియక ఈ తప్పులు చేశామని, మరోసారి అలాంటి తప్పులు చేయబోమని, యువత బెట్టింగ్ యాప్స్ (Betting apps)ను నమ్మొద్దని వీడియోలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్.. ప్రమోషన్ హాట్ టాపిక్ గా మారడంతో గతంలో వాటిని ప్రమోట్ చేసిన వారి వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) పై కేసు నమోదైంది. ఈ విషయాన్ని సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ మాట్లాడినందునే అతడిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఎవరూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయవద్దని, బెట్టింగ్ మూలాలపై పోరాడదామంటూ పోస్టు పెట్టాడు. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయబోనని ఈ సందర్భంగా హర్షసాయి అనూహ్య పోస్ట్ పెట్టారు. గతంలో కూడా అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఈ యాప్‌లను ప్రమోట్ చేయకపోతే మరికొందరు చేస్తారని.. తాను.. ప్రమోట్ చేస్తే.. తనకు డబ్బు వస్తుందని, ఆ డబ్బును మంచి కార్యక్రమాలకు, పేదలకు ఉపయోగపడతాయని చెప్పగా ఆ వీడియోలు వైరల్ గా మారాయి.