- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు’: హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ‘రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమీ తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నావు’ అంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.