సహాయక చర్యలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |   ( Updated:2024-09-03 14:55:15.0  )
సహాయక చర్యలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంగళవారం వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదల్లో సర్వం కోల్పోయి, కట్టు బట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓ వైపు వరదలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వం తీరిగ్గా నిద్ర లేచిందన్నారు. వరదల్లో 30 మంది చనిపోతే, 15 మంది మాత్రమే చనిపోయారని చెబుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఏదో తూతూ మంత్రంగా నష్టపరిహారం ప్రకటించారని, మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత భారీగా వరదలు సంభవించినా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు పంపలేదని నిలదీశారు. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని హరీష్ రావు విమర్శించారు. వర్షం తగ్గి 24 గంటలు గడుస్తున్నా.. ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్దరణ చేయలేదని అన్నారు. తాగడానికి మంచినీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేవలం 5 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ మంత్రులు చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed