హర్యానా ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభావం.. ఎన్నికల ఫలితాలపై హరీశ్ రావు రియాక్ట్

by Ramesh N |   ( Updated:2024-10-08 15:35:49.0  )
హర్యానా ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభావం.. ఎన్నికల ఫలితాలపై హరీశ్ రావు రియాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వత్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటకే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. జమ్మూ‌కాశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై మంగళవారం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందన్నారు.

ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. కాశ్మీర్‌లో బీజేపీని విశ్వసించలేదని, హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదన్నారు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టమవుతోందని ఆసక్తికర పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed