Harish Rao : కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తం.. ఎక్స్‌లో హరీష్ రావు ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
Harish Rao : కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తం.. ఎక్స్‌లో హరీష్ రావు ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా రైతు ఆత్మహత్య కలకలం రేపింది. రైతు సురేందర్ రెడ్డి (52) అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు గాంధీ ఆసుపత్రిలోని మార్చారీలో ఉన్న రైతు సురేందర్ రెడ్డి డెడ్ బాడీని చూసి నివాళులు అర్పించారు.

ఈ క్రమంలోనే హరీష్ రావు తాజాగా ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పంట పండించే రైతన్న ప్రాణంకోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి.. ధైర్యాన్ని కోల్పోకండి.. అని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదలి పెట్టమన్నారు.కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరని ఆరోపించారు. దయచేసి సీఎం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ అమలు విషయంలో సీఎం నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెలకావొస్తున్నదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed