- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Congress: హరీశ్ రావు.. మీ నాయకులు హద్దు దాటకుండా చూస్కోండి
దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం రోజు రోజుకు రచ్చగా మారుతున్నది. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి అనుచరులు దాడి చేయగా ఇవాళ బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వెళ్తామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రమే బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేపట్టగా ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీశ్ రావు వెళ్లడంపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహిళలను కించపరిచిన వ్యక్తికి, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టిన వ్యక్తికి మద్దతుగా మీరు వెళ్లడం సిగ్గుమాలిన చర్య అంటూ దుయ్యబట్టింది. ఇంత జరుగుతుంటే మీ పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రలో ఉన్నారా? లేక ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల రూపకల్పన తానే చేస్తున్నాడా అని ప్రశ్నించింది. పదివేల మంది వస్తారు అని చెప్పడం వెనుక మీ కుట్రల ఆంతర్యం బయటపడుతున్నదని, ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం ఇలా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అర్థమవుతుందని పేర్కొంది.
తెలంగాణ బిడ్డలను ఆగం చేసేందుకు మీ కుటుంబం కంకణం కట్టుకుందా హరీశ్ రావు గారు.. ప్రజా పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మీ దిక్కుమాలిన చర్యలు ప్రజలకు విఘాతం కలిగిస్తున్నాయని దుయ్యబట్టింది. మహిళలను, ఒక వర్గం ప్రజలను కించపరిచిన వ్యక్తిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అతన్ని వెనకేసుకురావడం వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నించింది.
నగరంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తుంటే మీ బీఆర్ఎస్ నాయకులు అల్లకల్లోలం సృష్టించడానికి పూనుకున్నారా? ఇప్పటికైనా హరీశ్ రావు గారు.. మీ నాయకులు అవధులు దాటకుండా చూసుకోవాలి. లేదంటే ఈ గొడవల కుట్రలు మీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని భావించాల్సి వస్తుందని పేర్కొంది.