- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుతో రేవంత్ రెడ్డి మాట్లాడి అలా చేయాల్సిందే.. హరీష్ రావు డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి.. 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను తమ ప్రభుత్వ హయాంలో చాలా అభివృద్ధి చేశామన్నారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని.. దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలను కేసీఆర్ నిలిపారన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. సర్పంచుల టర్మ్ ముగిసిందని, జిల్లా పరిషత్ కాలం ముగిస్తోందని.. అయినా ఎన్నికలు నిర్వహించడం లేదని కాంగ్రెస్ సర్కారుపై సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాడు 87 ట్రాక్టర్లు పంచాయతీల్లో ఉంటే నేడు 12,769 ట్రాక్టర్లు ఉన్నాయన్నారు. దీన్ దయాల్, సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.
స్థానిక సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా, డెంగీ వైరల్ జ్వరాలు ప్రభలితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా జీతం ఖమ్మంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఉద్విగ్నానికి లోనయ్యారు. కాంగ్రెస్సే రైతు ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. చనిపోయిన రైతు సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారని.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో 7 మండలాలు, లోయర్ సీలేరు ఏపీలో కలిపారని గుర్తు చేశారు. కేసీఆర్ నాడు తీవ్రంగా స్పందించి, నిరసన తెలిపారన్నారు. బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మీ సహచరుడు మీదనే ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడిందని.. చంద్రబాబు మీద ఒత్తిడి చేసి 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆ తర్వాత విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.