- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Harish Rao: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం: హరీశ్‌రావు
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈ అరెస్ట్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు చేస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా? నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ తన పోస్ట్‌లో హరీశ్ రావు రాసుకొచ్చారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) November 13, 2024
పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు.
పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?…