Harish Rao: ఖమ్మం జిల్లాలో రైతు బలవన్మరణం.. మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ట్వీట్

by Shiva |
Harish Rao: ఖమ్మం జిల్లాలో రైతు బలవన్మరణం.. మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తన భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి దున్నుతున్నాడనే మనస్తాపంతో ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలం జాన్‌పహాడ్‌ తండాకు చెందిన ఏలేటి వెంకట్‌రెడ్డి ఈనెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో అతడు తీసిన సెల్ఫీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, వెంకట్‌రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ ట్వీట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘ఖమ్మం జిల్లాలో రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం. ఖమ్మం రూరల్‌ మండలం జాన్‌ పహాడ్‌‌తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్‌‌‌రెడ్డి మృతి బాధకరం. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వెంకట్‌ ‌రెడ్డి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న నమ్మకానికి నిదర్శనం. ఇటీవలే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో జరిగిన రైతు ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో అన్నదాత ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. రైతులు ఏమాత్రం అధైర్యడొద్దు. ఏమైనా సమస్యలుంటే పోరాడి పరిష్కరించుకుందాం. చావు సమస్య పరిష్కారానికి మార్గం కాదు’. అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story