- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: రాహుల్ గాంధీ చెప్పేది నిజమా? రేవంత్ చెప్పేది నిజమా?
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి బయటపడిందని అన్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఒకవైపు కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేశ్ ఆ పథకంపై విమర్శలు చేస్తుంటే.. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఆ పథకానికి నిధులు కేటాయించారని విమర్శలు గుప్పించారు. దేశాన్ని బీజేపీ అదానీకి దోచిపెడుతోందని రాహుల్ అంటుంటే.. ఇక్కడేమో అదానీతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి విషయంలో కాంగ్రెస్ జాతీయ నేతలు చెప్పేది వాస్తవమా? లేక ఇక్కడి రాష్ట్ర నేతలు చెప్పేది వాస్తవమా? అనేది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story