- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు మళ్లీ కేసీఆర్‌ను గుర్తుచేసుకునే పరిస్థితి వచ్చింది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం హరీష్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 5 నెలల్లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ‘వద్దు రా నాయనా ఈ కాంగ్రెస్ పాలన’ అంటున్నారని కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ పాలనపై ఎద్దేవా చేశారు. ఇవాళ రైతులు, మహిళలు, పెన్షన్ దారులు తిరిగి కేసీఆర్‌ను గుర్తు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు.