KCR ఆ పని చేసుంటే.. కాంగ్రెస్ నేతలంతా జైళ్లోనే: మాజీ మంత్రి హరీష్ రావు

by Satheesh |   ( Updated:2024-01-09 15:17:54.0  )
KCR ఆ పని చేసుంటే.. కాంగ్రెస్ నేతలంతా జైళ్లోనే: మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగు రోజులు ఓపిక పట్టండి.. మళ్లీ బీఆర్ఎస్‌కు బంగారు పల్లెంలో పెట్టి అధికారం ఇస్తారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమే.. భవిష్యత్ మనదేనన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు గ్రూపులు ఉన్నాయని.. ఒకటి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరొకటీ టీడీపీ కాంగ్రెస్, ఇంకొకటి ఒరిజినల్ కాంగ్రెస్ అని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకొని ఉంటే కాంగ్రెస్ నేతలు ఇవ్వాళ జైళ్లలో ఉండే వారన్నారన్నారు. అభివృద్ధి గురించే నిత్యం కేసీఆర్ ఆలోచించే వారని, ఆయనకు పని తనం తప్ప పగతనం తెలియదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలు రగులుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కసితో పని చేస్తారన్నారు. కాంగ్రెస్ అన్నింటికీ వంద రోజుల డెడ్ లైన్ పెడుతోందని విమర్శించారు. ఆ వంద రోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌పై చీటింగ్ కేసులు పెడతారన్నారు. తాము హైదరాబాద్‌లో ఎక్కువ ఉండం.. మీ కోసం.. మీ దగ్గరకే వస్తామని స్పష్టం చేశారు.

బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదంటున్నారని, బీఆర్ఎస్ లేక పొతే తాము తెలంగాణకు అన్యాయం చేయోచ్చని అనుకుంటున్నారని, ఆయన ఆశలు అడియాశలే అవుతాయన్నారు. పార్లమెంటులో ఎక్కువ ప్రశ్నలు అడిగింది బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాత్రమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే ఖమ్మం జిల్లాకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. విభజన సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఏడు మండలాలను ఏపీలో కలిపాయని మండిపడ్డారు. సీలేరు ప్రాజెక్టును లాక్కున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ అని ప్రజలు అక్కున చేర్చుకోవాలని కోరారు.

Advertisement

Next Story