Mahesh Kumar Goud:హరీశ్, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరు.. పీసీసీ చీఫ్ సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
Mahesh Kumar Goud:హరీశ్, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరు.. పీసీసీ చీఫ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో చేరికలపై టీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ (CONGRESS) పార్టీలోకి బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయన్నారు. తమ పార్టీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఆసక్తితో తమకు అర్జీలు పెట్టుకున్నారని కానీ తామే తుది నిర్ణయం తీసుకోవడంలో సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌కు పొసగడం లేదనే సమాచారం తమకు ఉందని, రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ఓకే పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో స్థానాలు సాధించాక ఇక ఆ పార్టీ మనుగడ సాధిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగై రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీనే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ కావడమో? మెజార్టీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కలవడమో జరుగుతుందన్నారు. కేసీఆర్ (KCR) ఎవరి ఒత్తిడితో బయటకు రావడం లేదని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. కేటీఆర్ తన రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను నిర్బంధించారని సంచలన ఆరోపణలు చేశారు.

కొత్త ఎమ్మెల్యేలు వచ్చినా.. పాతవారికే పదవులు..

కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరిన చోట్లలో కొత్త, పాత నేతల మధ్య కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సెట్ రైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని మహేశ్ గౌడ్ తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చి చేరినా పార్టీలో పదవులు, ప్రయార్టీ పాత కాంగ్రెస్ నేతలకే ఉంటుందన్నారు. కొత్త ఎమ్మెల్యేల అనుచరులు పదవుల కోసం కొంచెం ఆగాలని సూచించారు. మంత్రివర్గ విస్తరణపై సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. రేపటి నుంచి జిల్లాల్లో తాను పర్యటించబోతున్నానని, కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ప్రకటించారు.

బీఆర్ఎస్ నేతలకు సవాల్..

పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ ఏడాది పాలనపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. లగచర్లలో భూమిలేనివారు అధికారులపై దాడి చేశారని.. కేటీఆర్ (KTR) తప్పు చేశా అని ఫీలవుతున్నాడని, పార్ములా వన్ ఇష్యూలో ఆయన చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని అన్నారు. అందువల్లే తాను జైలుకు పోతానని అంటున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని ఇంకా జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రజలు అడుగుతున్నారని, కానీ చట్టప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మండిపడ్డారు.

Advertisement

Next Story