- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుపాకులు పట్టుకుంటే ఆపడం కష్టం: గోనె ప్రకాశ్
దిశ, డైనమిక్ బ్యూరో: రామగుడం ఎరువుల కర్మాగారం జాబ్ స్కాంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే ప్రకాశ్ రావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం మావోయిస్టుల వరకు చేరిందని బాధితులు వారి వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందన్నారు. బాధితుల పక్షాన తాను ఈ విషయాన్ని ముందే హెచ్చరించానని అయినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. హరీష్ మృతికి ఎమ్మెల్యే, మంత్రినే కారణమని వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. రాజకీయాలు అంటే వ్యాపారం కాదని ఇకనైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. అలా జరగకుంటే ఈ ప్రాంతంలో అశాంతి, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. కాగా, ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రిపై తీవ్ర ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.