మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం

by samatah |   ( Updated:2022-08-09 07:56:11.0  )
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమని, కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ పాలన అంటున్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే కుటుంబ పాలన ఉంది. ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, కాంట్రాక్టుల కోసం బీజేపీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యక్తిగతంగా రాజగోపాల్‌కు.. రాజకీయంగా బీజేపీకి అవసరం. మునుగోడు అభివృద్ధి కోసం అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే బీజేపీ ఉప ఎన్నికల వ్యూహం పన్నిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. సెక్యులర్ రాష్ట్రంలో సెక్యులరిజం కేసీఆర్‌తోనే సాధ్యం అని పేర్కొన్నారు. రేవంత్‌పై దాసోజు శ్రావణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయని, చాలా రాష్ట్రాలలో ప్రజలకు తినడానికి సరైన తిండి లేదు. అది వదిలి ఇతర అంశాల మీద మోడీ దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.

బీజేపీ ఎదుట జయసుధ కీలక డిమాండ్లు.. చేరికపై క్లారిటీ

Advertisement

Next Story